Dec 24, 2020, 2:00 PM IST
దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా (అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం) మైదానంలో భారతయ జనతా పార్టీ దివంగత సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లి విగ్రహ ప్రతిష్ట చేయనుండటంపై భారత దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ బేడి మండిపడ్డారు. నిరుడు అరుణ్ జైట్లీ మరణానంతరం, కోట్లా స్టేడియానికి హడావుడిగా బీజేపీ నేత పేరుతో నామకరణం చేశారు. ఇప్పుడు స్టేడియంలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టకు ఏర్పాట్లు చేస్తున్నారు. డీడీసీఏ నిర్ణయం జైట్లీ విగ్రహం ఏర్పాటే అయితే.. స్టాండ్స్‌కు తన పేరును తొలగించాలని, డీడీసీఏ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బేడి కోరారు. ఈ నేపథ్యంలో అక్కడ నెలకొన్న పరిస్థితులు ఏమిటో చూద్దాము.