హైదరాబాద్ ని వెంటాడిన దురదృష్టం, బెంగళూరును గెలిపించిన కోహ్లీ కెప్టెన్సీ

22, Sep 2020, 1:00 AM

IPL 2020 సీజన్ 13లో భాగంగా జరిగిన మూడో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 153 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 15.1 ఓవర్లలో 121/2 పరుగులతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, సులువుగా లక్ష్యాన్ని చేధించేలా కనిపించింది. అయితే వెంటవెంటనే వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.