'ఆర్చర్ బాబా' 4 సిక్సర్లు: సోషల్ మీడియాలో వైరల్

Sep 22, 2020, 11:00 PM IST

జోఫ్రా ఆర్చర్ బాబా... ప్రపంచంలో ఏం జరిగినా ఆర్చర్ వేసిన పాత ట్వీట్లు తెరపైకి వస్తుంటాయి. చెన్నై సూపర్ కింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలబడిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు ఆర్చర్. ఇంగిడి వేసిన ఈ ఓవర్‌లో మొదటి రెండు బంతులను బౌండరీ అవతల పడేశాడు ఆర్చర్. ఆర్చర్ దూకుడికి వరుసగా రెండు నో బాల్స్ వేశాడు ఇంగిడి. ఆ రెండు బంతులను కూడా సిక్సర్లుగా మలిచాడు ఆర్చర్.