ముంబై వర్సెస్  బెంగళూరు: ఉత్కం'టై' పోరులో ఆర్సీబీ 'సూపర్' విక్టరీ

29, Sep 2020, 1:40 AM

ఐపీఎల్ 2020లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ అభిమానులకు కావాల్సినంత కిక్‌నిచ్చింది. బెంగళూరు ఈజీగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ కాస్తా, పోలార్డ్, ఇషాన్ కిషన్‌ల ఇన్నింగ్స్‌ల కారణంగా ‘టై’గా మారి.. సూపర్ ఓవర్‌లోనూ ఉత్కంఠ కొనసాగింది. సూపర్ ఓవర్ ఆఖరి బంతికి ఫోర్ బాది, ఆర్‌సీబీకి రెండో విజయాన్ని అందించాడు కింగ్ కోహ్లీ. 78 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబై, మ్యాచ్ చేజార్చుకునేలా కనిపించింది. అయితే యంగ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్, కిరన్ పోలార్డ్ అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది.