Jan 6, 2021, 2:17 PM IST
సాధారణంగానే ఆస్ట్రేలియా క్రికెటర్ల కోసం భారీగా ధర చెల్లించడానికి రెఢీగా ఉంటాయి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు. 2020 ఐపీఎల్ వేలంలో ఆసీస్ ఆల్‌రౌండర్ ప్యాట్ కమ్మిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కోసం కోట్లకు కోట్లు కుమ్మరించడానికి రెఢీ అయిపోయాయి ఫ్రాంఛైజీలు. కోట్లు కొల్లగొట్టుకున్న ఈ ఇద్దరు ఆసీస్ ప్లేయర్లు, ఐపీఎల్‌లో పెద్దగా ప్రదర్శన ఇవ్వలేకపోయారు. అయితే ఈ సారి కూడా ఆసీస్ ప్లేయర్లకు భారీ ధర పలికే అవకాశం ఉంది.