ఐపీఎల్ 2020: పంజాబ్ పై పోరులో రాజస్థాన్ రాయల్ విక్టరీ, ప్లే ఆప్స్ బెర్తులు మరింత ఉత్కంఠం

Oct 31, 2020, 1:51 AM IST

IPL 2020 సీజన్ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అదిరిపోయే ఆటతీరుతో అద్భుత విజయాన్ని అందుకుంది రాజస్థాన్ రాయల్స్. 186 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్ రాయల్స్‌కి గత మ్యాచ్ సెంచరీ హీరో బెన్ స్టోక్స్ చక్కని ఆరంభాన్ని అందించాడు. 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో అద్భుత హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు బెన్‌స్టోక్స్. రాబిన్ ఊతప్ప 23 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 30 పరుగులు చేయగా సంజూ శాంసన్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు చేసి హాఫ్ సెంచరీ ముందు రనౌట్ అయ్యాడు. అప్పటికే రన్‌రేట్ భారీగా పడిపోవడంతో కెప్టెన్ స్టీవ్ స్మిత్, బట్లర్ కలిసి మిగిలిన లాంఛనాన్ని ముగించారు.