పవర్ హిట్టర్.. ప్రపంచాన్ని షాక్ చేసిన రాహుల్ తెవాటియా..

28, Sep 2020, 7:58 PM

రాజస్థాన్ రాయల్స్ లో ఓ పవర్ హిట్టర్ ఉన్నాడని ప్రపంచానికి ఆదివారం నాడే తెలిసింది. ఒక్క ఓవర్ లో నాలుగైదు సిక్సర్లు బాదుతాడని ప్రత్యర్థి పంజాబ్ టీం కలలో కూడా ఊహించి ఉండదు. రాహుల్ తెవాటియా మొన్నటివరకు లెగ్ స్పిన్నర్ గానే అందరికీ తెలుసు. కానీ ఇప్పుడ ఆయన పవర్ హిట్టర్ గా రాజస్థాన్ రాయల్స్ టీం కు హీరో అయిపోయాడు.