Feb 13, 2021, 4:20 PM IST
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ అద్భుత సెంచరీ నమోదుచేశాడు. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తరహాలో వన్డేల్లో బ్యాటింగ్ చేస్తున్నట్టుగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ, 47 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 78 బంతుల్లోనే 13 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 80 పరుగుల మార్కు అందుకున్న రోహిత్ శర్మ, సెంచరీ మార్కు అందుకునేందుకు 130 బంతులను ఎదుర్కొన్నాడు.