Sep 9, 2022, 10:06 AM IST
నిన్న ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచులో భారత్ 101 పరుగుల భారీ తేడాతో విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే. ఏషియా కప్ లో మ్యాచ్ కి ముందే భారత్ పోరు ముగియడంతో కనీసం ఈ మ్యాచులో అయినా నెగ్గి పరువు దక్కించుకోవాలన్న టీమిండియా ఒక సంపూర్ణ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచుకు రోహిత్ శర్మ కు రెస్ట్ ఇవ్వగా, కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న రాహుల్... ఈ మ్యాచులో విరాట్ తో కలిసి ధాటిగానే ఆడాడు. బ్యాట్ తో మంచి టచ్ లో కనిపించిన రాహుల్... మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు, ఆ పూర్తి వీడియో మీకోసం..!