ఎడ్యుకేషన్ లోన్ కోసం అప్లై చేస్తున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి

Jun 30, 2023, 4:55 PM IST

మంచి విద్య మంచి భవిష్యత్తుకు సోపానం. కెరీర్‌లో విజయం సాధించాలంటే మంచి విద్యా సంస్థల్లో చదవడం కూడా చాలా ముఖ్యం. అయితే రోజురోజుకు చదువు ఖరీదు ఎక్కువ కావడంతో మంచి విద్యాసంస్థల్లో కోరుకున్న కోర్సు చదవడం ఆర్థికంగా సవాలుగా మారుతోంది. అంచనాల ప్రకారం, ప్రతి సంవత్సరం విద్య వ్యయం 15% నుండి 20% పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో, మీకు ఆర్థిక సహాయం అందించడానికి ఎడ్యుకేషన్ లోన్  ఉపయోగపడుతుంది.