Nov 16, 2021, 4:18 PM IST
అమరావతి: ఏపీలో ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు, స్థానిక సంస్థల కోటాలో 11 స్థానాలు భర్తీకానున్నాయి. ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను అధికార వైసిపి ప్రకటించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడి నామినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైన నేపపథ్యంలో అభ్యర్థులు డీసీ గోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్, ఇషాక్ బాషాకు సీఎం జగన్ మోహన్‌రెడ్డి బీ–ఫారం అందజేశారు.