Aug 2, 2022, 3:18 PM IST
గుంటూరు : వర్షంలో వేడి వేడి బజ్జీలు, పునుగులు తింటే ఆ మజాయే వేరు. అయితే ఈ పునుగులు ఎమ్మెల్యే వేసినవి అయివుంటే... ఆ అదృష్టం గుంటూరు ప్రజలకు దక్కింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మేడికొండూరు మండలం పేరేచర్లలో పర్యటించారు. ఈ క్రమంలోనే ఓ టిఫిన్ సెంటర్ వద్ద మహిళలను పలకరించిన ఎమ్మెల్యే చూపు పునుగులపై పడింది. ఇంకేముందు ఎమ్మెల్యే స్వయంగా పునుగులు వేసి అందరికీ తినిపించారు. ఎమ్మెల్యే వేసిన వేడివేడి గుంట పునుగులను అక్కడున్నవారి లొట్టలేసుకుంటూ ఆరంగించారు.