''మంగళగిరి-తాడేపల్లి కార్పోరేషన్ కు భారీ నిధులు... కేవలం తాగునీటికే రూ.230 కోట్లు''

Apr 28, 2022, 10:46 PM IST

మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం230 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్యాకేజీ 1 క్రింద సుమారు రూ.170 కోట్ల రూపాయలతో OHRS మరియు మెయిన్ పంపింగ్ స్కీమ్ పనులను ప్రారంభించడం జరిగిందన్నారు.ప్రతి ఇంటికి 24 గంటలు త్రాగునీరు సరఫరా చెయ్యాలని సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు, కాంట్రాక్టర్ తో కలిసి పని చేస్తామన్నారు. సుమారు 50 కోట్ల రూపాయలతో వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైప్లైన్ ఏర్పాటు పనులను మే 15లోపు ప్రారంభిస్తామని ఆర్కె వెల్లడించారు.