తాడేపల్లిలో మట్టి అక్రమ మైనింగ్ ... ఎవ్వరినీ వదిలిపెట్టబోం : ఎమ్మెల్యే ఆళ్ల వార్నింగ్

Oct 14, 2022, 3:59 PM IST

మంగళగిరి : తాడేపల్లి బోటు యార్డ్ వద్ద ఇరిగేషన్ శాఖకు చెందిన నల్లమట్టిని కొందరు అక్రమార్కులు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు. ఇవాళ ఉదయమే రెవెన్యూ అధికారులతో కలిసి మట్టి తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా మట్టిని అక్రమంగా తరలిస్తున్న వారినే కాదు కొనుగోలు చేస్తున్నవారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని... అక్రమార్కులు ఎవరైనా  సరే ఉపేక్షించరాదని ఎమ్మెల్యే ఆర్కే రెవెన్యూ సిబ్బంది, పోలీసులను ఆదేశించారు.