Dec 1, 2022, 10:37 AM IST
అమరావతి : రాజధాని నిర్మాణంతో ఉపాధి కోల్పోయిన అమరావతి ప్రాంత రైతు కూలీలకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే గతంలో ఆలస్యంగా పెన్షన్ డబ్బులు వస్తున్నాయని... సాధారణ పెన్షన్ల మాదిరిగానే ప్రతి నెలా ఒకటో తారీఖునే వేయాలని కోరారు. వారి అభ్యర్థనను మన్నించిన ముఖ్యమంత్రి రైతు కూలీలకు కూడా రూ.2500 పెన్షన్ ప్రతి నెలా ఆరంభంలోనే ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ క్రమంలోనే రాజధాని రైతు కూలీల పెన్షన్లను ఉండవల్లి గ్రామంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పంపిణీ చేసారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లొ మొత్తం 17,500 పెన్షన్ దారులు ఉన్నారుని... అందరికీ ఇవాళే పెన్షన్ అందుతుందని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు.