ప్రత్తిపాడు వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత... వైసిపి, టిడిపి వర్గాల రాళ్లు, చెప్పుల దాడి

Sep 12, 2022, 12:51 PM IST

గుంటూరు : వినాయక చవితి వేడుకలతో సైతం అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి రాజకీయం చేస్తున్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వినాయక నిమజ్జన ఊరేగింపు రాజకీయాల కారణంగా ఉద్రిక్తంగా మారింది. వైసిపి, టిడిపి వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు, చెప్పులు విసురుకోవడంతో బందోబస్తు కోసం వచ్చిన స్థానిక ఎస్సై గాయపడ్డాడు. ప్రత్తిపాడులో టిడిపి వర్గీయులు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం కోసం ఊరేగింపుగా తీసుకెళుతుండగా వైసిపి వర్గీయులు అడ్డుగావచ్చారు. మల్లయ్యపాలెం సెంటర్ వద్ద ఇరువర్గాలు ఎదురుపడటం ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు, చెప్పులతో దాడులు చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ప్రత్తిపాడులో అలజడి రేగింది. అక్కడే వున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి గొడవను ఆపడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే స్థానిక ఎస్సై అశోక్ గాయపడ్డాడు.