ఏపీ రైతులకు శుభవార్త... నేడే వ్యవసాయ ట్రాక్టర్ల పంపిణీకి సీఎం జగన్ శ్రీకారం

Jun 7, 2022, 10:25 AM IST

వైఎస్సార్‌ యంత్ర సేవా పథకంలో భాగంగా రైతులకు వ్యవసాయంలో సాయపడేందుకు భారీగా ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల మెగా పంపిణీకి వైసిపి ప్రభుత్వం సిద్దమయ్యింది. నేడు (మంగళవారం) గుంటూరు చుట్టుగుంట సెంటర్లో డాక్టర్‌ వైయస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసే ట్రాక్టర్లు, హర్వెస్టర్‌లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించనున్నారు.