Apr 1, 2022, 10:34 AM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు రంగం సిద్ధం చేసుకున్నారు. వచ్చే నెల 7వ తేదీన ఆయన ముహూర్తం ఖరారు చేుకున్నారు. ఏప్రిల్ 11వ తేదీన మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని తొలుత అనుకున్నారు. అయితే, 7వ తేదీననే విస్తరణ జరపాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. మొత్తం 35 మంది జాబితాను ఆయన సిద్ధం చేసుకున్నారు. అయితే, కొంత మందిని మంత్రివర్గంలో కొనసాగించాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా 25 మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది.