Aug 21, 2023, 5:00 PM IST
నరసరావుపేట : మంత్రి విడదల రజని సొంత నియోజకవర్గం చిలకలూరిపేటలో వైసిపి నాయకుల మధ్య విబేధాలు బయటపడ్డాయి. నాదెండ్ల మండల వైసిపి మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై చందవరంలో నిన్న దాడి జరిగింది. తమపై కర్రలు, గొడ్డళ్లతో దాడి చేసింది స్థానిక ఎమ్మెల్యే రజనీ వర్గమేనని... తమను అంతమొందించడానికి ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. తమపై జరిగిన హత్యాయత్నం వెనక మంత్రి రజని హస్తం వుందని శ్రీనివాస్ రెడ్డి ఆరోపిస్తున్నారు.