Aug 20, 2022, 8:11 AM IST
ప్రభుత్వ విప్, అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అల్లుడు పప్పిరెడ్డి మంజునాథ రెడ్డి (34) శుక్రవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కంచనపల్లిలోని అవంతి అపార్ట్మెంట్ నూట ఒకటో నెంబర్ ప్లాట్ లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మంజునాథ రెడ్డి అప్పుడప్పుడు ఈ ఫ్లాట్ కి వచ్చి రెండు మూడు రోజులు ఉండి వెళ్తుండేవాడు. మూడు రోజుల కిందట ఇక్కడికి వచ్చిన ఆయన శుక్రవారం శవమై కనిపించారు. మంజునాథ రెడ్డి స్వగ్రామం అన్నమయ్య జిల్లాలోని రామాపురం మండలం హసనాపురం పంచాయతీలోని పప్పిరెడ్డిగారిపల్లె. ఆయన తండ్రి మహేశ్వర్ రెడ్డి. వైసీపీ నాయకుడు, పిఎంఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ యజమాని. కుమారుడి మృతి వార్త తెలుసుకుని ఆయన హుటాహుటిన విజయవాడకు బయల్దేరారు.