అమ్మా బాగున్నావా అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ... నెల్లూరులో ఎమ్మెల్యే అనిల్ గడపగడపకు కార్యక్రమం

Jul 14, 2022, 2:40 PM IST

నెల్లూరు: మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు పట్టణంలో పర్యటించారు. అధికారులు, వైసిపి నాయకులతో కలిసి కాలనీల్లో పర్యటించిన ఎమ్మెల్యే అమ్మా బాగున్నారా... అంటూ ఆప్యాయంగా పలకరించారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో, వాలంటీర్ల పనితీరు ఎలావుందో మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఇలా పలు కాలనీల్లో తిరుగుతూ అనిల్ యాదవ్ ప్రజాసమస్యలు తెలుసుకున్నారు.