సీఎం జగన్ కు మోదీ పెద్ద లెక్కా..: వైసిపి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Feb 9, 2021, 1:35 PM IST

విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైసిపి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తప్పుబట్టారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పోరాట పటిమ గురించి ప్రతి ఒక్కరికి తెలుసని... 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన ఘనత ఆయనదని కొనియాడారు. అలాంటి జగన్ కు మోడీ పెద్ద లెక్కే కాదన్నారు ఎమ్మెల్యే అమర్నాథ్.