జగన్ ఇలాకాలో కాల్పుల కలకలం... వైసిపి నేత దారుణ హత్య

Jun 15, 2021, 2:08 PM IST

కడప: ముఖ్యమంత్రి జగన్ ఇలాకా పులివెందులలో తుపాకీతో కాల్పుల కలకలం రేపాయి.  వైసిపి నేతల మధ్య చెలరేగిన ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లి గ్రామంలో ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో వైసిపికే చెందిన రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చెలరేగింది. ప్రసాద్ రెడ్డి అనే నాయకుడి ఇంటిపైకి పార్ధసారధి అనే మరో నాయకుడు కత్తితో దాడికి వెళ్లాడు. దీంతో 
 ఆందోళనకు గురయిన ప్రసాద్ రెడ్డి (కాబోయే మండలాధ్యక్షుడు) తన దగ్గర ఉన్న లైసెన్స్  తుపాకీతో  పార్థసారధి రెడ్డి పై రెడ్డిపై కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు

 అనంతరం అదే తుపాకితో  ప్రసాద్ రెడ్డి  కూడా కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కుటుంబాలకు చెందిన మరో ముగ్గరు పులివెందుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ప్రస్తుతం పోలీసులు గ్రామంలో శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.