Mar 3, 2022, 5:13 PM IST
గుంటూరు: ఏపీ రాజధాని విషయంలో హైకోర్టు తాజా తీర్పు వైసిపి నేత, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రజలకు అవసరమైన అంశాలను కోర్టులు టేబుల్ మీదకు తీసుకోవడం లేదని...తమకు అవసరమైన అంశాలనే పరిగణలోకి తీసుకుంటున్నాయంటూ వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ లలో ఎవరు గొప్ప అన్నదానిపై పూర్తిస్దాయిలో చర్చ జరగాలన్నారు. అసెంబ్లీ లో చేసిన తీర్మానాలు చెల్లవని కోర్టులు చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమాన పరుస్తారా...? అని నిలదీసారు. ఏదేమైనా మూడు రాజధానుల నిర్ణయానికే తాము కట్టుబడి ఉన్నామని మాజీ ఎంపీ మోదుగుల పేర్కొన్నారు.