Aug 9, 2021, 4:15 PM IST
విశాఖపట్నం: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని వైజాగ్ తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీలు హాజరై తమ సాంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గుమ్మడి సంధ్యారాణి, గిడ్జి ఈశ్వరి, కిడారి శ్రావణ్ కుమార్, బుద్ధా నాగ జగదీశ్వరరావు, రామానాయుడు, భంజ్‌దేవ్ తో పాటు నాయకులు, గిరిజన ప్రముఖులు పాల్గొన్నారు. ఆదివాసీల సంప్రదాయ నృత్యాలతో నాయకులు కూడా జతకలిసి జై ఆదివాసీ అని నినదించారు.