గుంటూరు: వర్షాకాలంలోనూ నీటి కష్టాలు... ఖాళీ బిందెలతో మహిళల ధర్నా

Aug 31, 2021, 12:03 PM IST

గుంటూరు: వర్షాకాలంలోనూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపైకి వచ్చి ధర్నాకు దిగారంటే అక్కడ నీటిసమస్య ఎంత తీవ్రంగా వుందో అర్థం చేసుకోవచ్చు. సంవత్సర కాలంగా తమ నీటి సమస్యను ప్రజా ప్రతినిధులకు, అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోవడంతో ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నాకు దిగారు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి మహిళలు. హైవే రోడ్డుపై కూర్చుని వాహనాలను రాకపోకలను నిలిపేసి తమ త్రాగునీటి సమస్యపై ధర్నాకు దిగారు. దీంతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని మహిళలను సముదాయించి ధర్నాను విరమింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు.