Oct 20, 2022, 3:59 PM IST
అవనిగడ్డ : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా అవనిగడ్డ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఉదయమే అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సభాస్థలికి చేరుకున్న మహిళలకు తాగడానికి నీరు కాదుకదా కనీసం టాయి లెట్ సౌకర్యం లేక అల్లాడిపోయారు. ఇలా ఉదయం ఆరుగంటలకు వచ్చిన మహిళలు గంటల తరబడి అలాగే వున్నారు. బయటకు వెళదామంటే గేట్లకు తాళం వేయడంతో దిక్కుతోచని స్థితిలో అలాగే వుండిపోయారు. దీంతో కొందరు మహిళలు స్పృహతప్పి పడిపోయారు. వారిని హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.