Nov 20, 2019, 4:39 PM IST
ఇసుక అక్రమ నిర్వాహకులను అరెస్ట్ చేయాలని కృష్ణా జిల్లా షేర్ మహమ్మద్ పేట గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదురుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్త కృష్ణకుమారి ధర్నాకు దిగింది. తన కొడుకుమీద ఇసుక అక్రమరవాణా కేసు వేసి అరెస్ట్ చేశారని, గ్రామంలో అక్రమంగా ఇసుక డంపింగ్ యార్డ్ పెట్టి, ఇసుక అక్రమ వ్యాపారం చేస్తున్న గ్రామ వైసీపీ నేతలను కూడా అరెస్ట్ చేయాలని కోరుతూ ధర్నా చేసింది. పోలీసుల జోక్యంతో మహిళలు ధర్నాను విరమించారు.