మహిళా సిబ్బందిపై కమీషనర్ లైంగిక వేధింపులు... ధర్నాకు దిగిన కార్మికులు

Dec 28, 2020, 12:26 PM IST

విజయవాడ: కృష్ణా జిల్లా పెడన మున్సిపల్ కమిషనర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళా కార్మికుల ధర్నాకు దిగారు. అధికారి వేధింపుల నుండి తమను కాపాడాలని... తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మహిళా కార్మికుల ధర్నాకు సిఐటియు మద్దతు తెలిపింది. మహిళ కార్మికురాలపై లైంగిక వేధింపులకు దిగిన మున్సిపల్ కమిషనర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ... కీచక కమిషనర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా సాగుతోంది.