కన్నబిడ్డలకోసం ఎదురు చూసి తుదిశ్వాస విడచిన లక్ష్మి

Feb 13, 2021, 9:33 AM IST

విజయవాడ: కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రక్కనే నిర్మాణం చేస్తున్న భవనం వద్ద పనిచేస్తున్న కార్మికురాలు లక్ష్మీ ఆమె మేనకోడలు తో పాటు బయటకు వెళ్లేందుకు రోడ్డు మీదకు రావడం తో వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఆమెను ఢీకొని దూసుకుని వెళ్లడంతో శరీరమంతా నజ్జుగా మారింది.  

ఉన్న లక్ష్మి ఆఖరి చూపు చూసేందుకు తన పిల్లలను కలవాలని చూడాలని చెప్పినట్లు స్థానికులు ఘటనా స్థలంలో వివరించాడు. మితిమీరిన వేగంతో వచ్చిన లారీ ఆయిల్ ట్యాంకర్ ను డ్రైవర్ ను గన్నవరం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. 

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న గన్నవరం ఎస్సై పురుషోత్తం ఆమెకు  నీరు అందించే ప్రయత్నం చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న తన కొడుకు,కూతురుతో మీరు జాగ్రత్త అక్క చెప్పినట్లు విను నాన్న జాగ్రత్త నేను లేనని బాధ పడకండి జాగ్రత్త అని పదేపదే చెప్పినట్లు తెలిపారు.ఆ తరువాత తుది శ్వాస విడిచారు. ఆ ఘటనను చూసిన ప్రతి ఒక్కరి గుండె కలచివేసింది.