Apr 10, 2023, 5:48 PM IST
బాపట్ల : అదనపు కట్నం కోసం భర్త వేధింపులు ఓవైపు...న్యాయం కోసం వెళితే పోలీసుల బెదిరింపులు మరోవైపు... దీంతో ఏం చేయాలో దిక్కుతోచక ఎస్పీని ఆశ్రయించిందో వివాహిత. ఈ అమానుష ఘటన బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. కొల్లూరు మండలం పెసర్లంక గ్రామానికి చెందిన సాప్ట్ వేర్ ఇంజనీర్ శ్రీనివాస్-భార్గవి దంపతులు. పెళ్లయ్యాక కొన్నాళ్లు సంసారం సాఫీగానే సాగినా అదనపు కట్నం కోసం భార్యను వేధించడం ప్రారంభించాడు శ్రీనివాస్. చివరకు భార్యను గత ఏడాది కాలంగా పుట్టింట్లో వదిలివెళ్లాడు. ఇదేంటని ప్రశ్నించిన భార్గవితో పాటు తల్లిదండ్రులను శ్రీనివాస్ కుటుంబం కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. దీంతో భార్గవి కుటుంబం పోలీసులను ఆశ్రయించగా అక్కడా న్యాయం జరగలేదు. దీంతో న్యాయం చేయాలంటూ బాధితురాలు బాపట్ల ఎస్పీని ఆశ్రయించింది.