Aug 11, 2022, 6:15 PM IST
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో దారణం చోటుచేసుకుంది. అత్త తన కోడలిని దారుణంగా హత్య చేసి.. కోడలి తలతో పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. వివరాలు.. రాయచోటి మండలం కొత్తపేట రామాపురంలో సుబ్బమ్మ అనే మహిళ తన కోడలు వసుంధరను నరికి చంపింది. అనంతరం కోడలి తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సుబ్బమ్మను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.