Jun 25, 2022, 2:56 PM IST
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కల్లికోట గ్రామంలో అర్ధరాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఊరిపై పడి కార్లు, బియ్యం సరఫరా వ్యాన్, ద్విచక్రవాహనాలపై ఏనుగులు దాడి చేసి ధ్వంసం చేశాయి. ఒక ఏనుగు సింగిల్ గా తిరుగుతూ గ్రామాల్లో ఇల్లు వద్దకు వెళ్లి ప్రజలందర్నీ భయాందోళనకు గురి చేసింది. దీంతో గ్రామస్తులు ఏనుగును తరిమి అటవీ ప్రాంతానికి తరలించారు. ఏనుగుల నుంండి ఎలాంటి ప్రాణ నష్టం జరగకముందే అటవీశాఖ అధికారులు ముందుజాగ్రత్తల చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.