Feb 8, 2021, 4:52 PM IST
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద వాలంటీర్లు నిరసనకు దిగారు. తమ వేతనాన్ని పెంచడమే కాకుండా పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని... లేనిపక్షంలో ఉద్యమం ఉదృతం చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇలా గుంటూరు, ఏలూరు, విశాఖలోని గాజువాక లో వాలంటీర్లు నిరసనకు దిగారు. సీఎం జగన్ వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కారించాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు.