Oct 18, 2022, 2:01 PM IST
పల్నాడు : సంక్షేమ పథకాల ఆశచూపి ఓ వాలంటీర్ వివాహితను లోబర్చుకున్న ఘటన పల్నాడు జిల్లా నరసరావుపేటలో వెలుగుచూసింది. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు ఇప్పిస్తానని వివాహిత ఆఫ్రిన్ ని లోబర్చుకున్నాడు వార్డు వాలంటీర్ జిలాని. అంతటితో ఆగకుండా వివాహితతో సన్నిహితంగా వున్న ఫోటోలు, వీడియోలను వివాహిత భర్తకు చూపించాడు వాలంటీర్, దీంతో ఆఫ్రిన్ భర్త ఇంట్లోంచి తరిమేసాడు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని జిలానీని వివాహిత కోరడంతో తప్పించుకుని తిరగసాగాడు. దీంతో మోసపోయానని గ్రహించిన వివాహిత పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు కూడా ఆమెకు న్యాయం చేయకపోవడంతో స్పందన కార్యక్రమంలో పాల్గొని జిల్లా ఎస్పీని కలిసి తన గోడు వెల్లబోసుకుంది.