గణేష్ మండపాలపై ఆంక్షలు : నందిగామలో విశ్వహిందూ పరిషత్ ధార్మిక సంఘాలు, హిందూ సంఘాల ర్యాలీ..

Aug 27, 2022, 2:30 PM IST

ఎన్టీఆర్ జిల్లా : విశ్వహిందూ పరిషత్ ధార్మిక సంఘాలు హిందూ సంఘాలు ఆధ్వర్యంలో నందిగామలో ర్యాలీ నిర్వహించారు. నందిగామ రథం సెంటర్ నుంచి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం విశ్వహిందూ పరిషత్ సంఘాలు ఎమ్మార్వో ఎస్ నరసింహారావుకి వినతి పత్రం అందజేశాయి. గణేష్ మండపాలపై పెట్టిన ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలని నినాదాలు చేశారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే వినాయక చవితి పండగకు పరిమిషన్లు ఎందుకు తీసుకోవాలి అంటూ  విశ్వహిందూ పరిషత్ సభ్యులు ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని తన వైఖరి మార్చుకోవాలని విశ్వహిందూ పరిషత్ సభ్యులు అన్నారు.