విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం... మంటలు చెలరేగి నడిరోడ్డుపై కారు దగ్దం

Mar 9, 2022, 3:03 PM IST

విశాఖపట్నం: నడిరోడ్డుపైనే ఓ కారు మంటల్లో చిక్కుకుని దహనమైన ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. నక్కపల్లి మండలం ఉద్ధండపురం జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారుకు విధికుక్క అడ్డువచ్చింది. దీంతో సడన్ బ్రేక్ వేయడంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అంతేకాదు వెనకనుండి వచ్చిన మరో కారు కూడా ఈ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుండి ఇద్దరు చిన్నారులతో సహా మరొక నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేసారు. అప్పటికే కారు ముందుభాగం మొత్తం అగ్గికి ఆహుతయ్యింది.