Oct 15, 2022, 2:10 PM IST
విశాఖపట్నం : వికేంద్రీకరణకు మద్దతుగా అధికార వైసీపీ ఆధ్వర్యంలో రాజకీయేతర ఐకాస 'విశాఖ గర్జన' పేరుతో చేపట్టిన ర్యాలీ విశాఖలోని ఎల్‌ఐసీ జంక్షన్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. పలువురు రాష్ట్ర మంత్రులు ఆర్కే రోజా, రజిని, ముత్యాల నాయుడు, అమర్నాథ్, స్పీకర్ సీతారాం, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, పుష్ప శ్రీవాణి, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఎల్‌ఐసీ జంక్షన్ నుంచి మొదలైన ర్యాలీ, విశాఖ పార్క్ హోటల్ జంక్షన్‌కు చేరుకోనుంది. అనంతరం హోటల్ వద్దనున్న వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద సభ నిర్వహించనున్నారు. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా విశాఖలో వర్షం కురవడంతో ర్యాలీకి పెద్దఎత్తున నగరవాసులు హాజరు కాలేకపోయారు. ర్యాలీ నేపథ్యంలో నగరంలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇ విశాఖ గర్జన సభా ప్రాంగణానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి...మంత్రులు బొత్స, విడుదల రజిని, జోగి రమేష్, రోజా, బుగ్గన, కారుమూరి నాగేశ్వరరావు, వైసీపీ ఎమ్మెల్యేలు. నేతలు చేరుకున్నారు.