ఇక కరెన్సీ నోట్లను కడగనక్కరలేదు.. ఈ మిషన్ లో పెడితే చాలు...

Jul 3, 2020, 12:20 PM IST

విశాఖపట్నంలోని డీజిల్ లోకో షెడ్ ఓ నూతన ఆవిష్కరణకు నాంది పలికింది. కరెన్సీ నోట్లను శానిటైజ్ చేసే మిషన్ ను కనిపెట్టింది. కరోనా వైరస్ భయంతో కాగితాలు, కరెన్సీ లావాదేవీల విషయంలో రైల్వే శాఖలో భయం నెలకొన్న నేపథ్యంలో ఈ ఆవిష్కరణ మంచి పరిణామంగా చెప్పవచ్చు. UVC కిరణాల ద్వారా వైరస్ ను చంపేసి నోట్లను శుద్ధి చేస్తుంది ఈ మిషన్.