కుటుంబసమేతంగా... శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Mar 5, 2021, 11:37 AM IST

తిరుపతి: భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉ.5.30  గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి చేరుకున్న వెంకయ్యకుటుంబం కలియుగదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉప రాష్ట్రపతి వెంట రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్పి వెంకట అప్పల నాయుడు ఉండగా, వైకుంఠం కాంప్లెక్స్  వద్ద  టిటిడి అదనపు ఈ ఓ ధర్మారెడ్డి, సివిఎస్ఓ గోపినాధ్ జెట్టి తదితరులు స్వాగతం పలికారు. ఆలయం మహాద్వారం వద్ద టిటిడి ఈఓ జవహర్ రెడ్డి స్వాగతం పలికారు.శ్రీవారి దర్శనం అనంతరం ఉపరాష్ట్రపతి కుటుంబం రంగనాయకుల మండపంలోకి చేరుకోగా వేద పండితుల ఆశీర్వదంతో తీర్థ ప్రసాదాలను ఈఓ అందజేశారు.