Oct 31, 2022, 12:19 PM IST
విశాఖపట్నం : స్వాతంత్య్ర భారత తొలి హోంమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళి అర్పించారు. వైజాగ్
సర్క్యూట్ హౌస్ జంక్షన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం జరిగిన జయంతి కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.... జాతీయ సమైక్యత కోసం భారత తొలి హోంమంత్రిగా సర్దార్ పటేల్ చేసిన కృషి చిరస్థాయిగా మిగిలిపోతుందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఆ తర్వాత దేశ సమైక్యత కోసం పోరాడిన గొప్ప నేతగా చిరకాలం ప్రజలకు గుర్తుండిపోయే గొప్ప నాయకుడు పటేల్ అని అన్నారు. ఉక్కుమనిషిగా ఆయన చూపిన సమర్థత పాఠ్యపుస్తకాల్లోకి రావాలన్నారు. ప్రస్తుతం దేశాన్ని పట్టిపీడిస్తున్న ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని తిప్పుకొట్టడంలో పటేల్ స్పూర్తితో ప్రతి భారతీయుడు నడుం బిగించాలని వెంకయ్య నాయుడు సూచించాడు.