Aug 5, 2020, 1:08 PM IST
అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనకు టీడీపీ నేత వంగవీటి రాధ మద్దతు తెలిపారు. తుళ్ళూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం తుళ్ళూరులో రైతుల నిరసనకు మద్దతు పలికి, వారికి సంఘీభావం తెలిపారు. మూడు రాజధానుల గెజిట్ మీద హై కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే.