Aug 16, 2023, 4:18 PM IST
విజయవాడ : వంగవీటి రాధ. విజయవాడలో ఈ పేరు తెలియనివారు వుండరు. వంగవీటి రంగా కొడుకుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు రాధ. అలాంటి నాయకుడి పెళ్లంటే మామూలుగా వుంటుందా... రాధ పెళ్లాడే అమ్మాయి ఎవరా అన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా మొదలయ్యింది. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనకు కాబోయే భార్య ఎవరో బయటపెట్టారు రాధ. తన తండ్రి వంగవీటి రంగాకు కాబోయే భార్యతో కలిసి నివాళి అర్పించారు. నరసాపురం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జక్కం అమ్మాణి, బాబ్జీల కుమార్తె పుష్పవల్లిని రాధాకృష్ణ వివాహం చేసుకోబుతున్నాడు. సెప్టెంబర్ లో వంగవీటి రాధ, పుష్ఫవల్లి వివాహం జరగనుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.