Aug 5, 2022, 5:04 PM IST
విశాఖపట్నం : అధికార వైసిపి ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ పై టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గౌరవప్రదమమైన ఎంపీ పదవిలో వున్నవ్యక్తి పోరంబోకులా ప్రవర్తించాడని అన్నారు. ఈడియట్ప్, పోరంబోకులను చట్టసభలకు పంపిస్తే ఇలాగే వుంటుందని అనిత ధ్వజమెత్తారు.
హిందూపురం ఎంపీ మాధవ్ అసభ్యకర వీడియో వల్ల తెలుగు ప్రజలు తలదించుకునే పరిస్థితి వచ్చిందని అనిత అన్నారు. మహిళను కించపర్చేలా అసభ్యంగా వ్యవహరించిన ఎంపీ మాధవ్ ను బర్తరఫ్ చేసేవరకు టిడిపి పోరాటం కొనసాగుతుందని అన్నారు. మాధవ్ వికృత చేష్టలతో కేంద్రం వద్ద తెలుగు ఎంపీలు చురకల అయిపోయారని వంగలపూడి అనిత పేర్కొన్నారు.