గన్నవరం రాజకీయం: యార్లగడ్డ వర్గీయులపై వల్లభనేని వంశీ అనుచరుల దాడి

Sep 5, 2020, 1:17 AM IST

కృష్ణాజిల్లా రాజకీయాల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు బాహాబాహా స్థాయికి చేరి పోలీస్ స్టేషన్ కి చేరింది. యార్లగడ్డ వర్గీయులపై వంశి వర్గీయులు దాడి చేయడంతో ఇటు వంశి వర్గీయులు, అటు యార్లగడ్డ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. గన్నవరం మండలం చిన్నావుటపల్లి మాజీ సర్పంచి, వైసీపీ నాయకులు కోట వినయ్ పై ఎమ్మెల్యే వంశీ అనుచరుల దాడి చేసారు.