Dec 13, 2019, 1:47 PM IST
తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం రిజర్వాయర్ లో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యమయ్యింది. పోలీసులు నీటిమధ్యనుండి ఈ మృతదేహాన్ని తీరానికి తీసుకువచ్చారు. చనిపోయి దాదాపు 4,5 రోజులు అయ్యి ఉండవచ్చని, పూర్తిగా ఉబ్బిపోయిందని పోలీసులు తెలిపారు. కనిపించకుండా పోయిన కేసుల్లో ఎవరైనా అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.