Nov 8, 2019, 5:36 PM IST
శుక్రవారం సచివాలయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, ముఖ్యమంత్రి వైయస్.జగన్ తో భేటీ అయ్యారు. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు సంబంధించిన సీనియర్ అధికారులు, ఉక్కుశాఖ అధికారులతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయా శాఖలకు సంబంధించి పెండింగులో ఉన్న అంశాలు, దృష్టిపెట్టాల్సిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు వివరించారు.