ఇక ఆత్మహత్యలే దిక్కు... కారుణ్య మరణాలకు అనుమతివ్వండి: రాష్ట్రపతికి ఏపీ రైతుల లేఖ

Apr 29, 2022, 4:49 PM IST

తాడేపల్లి: తమ గ్రామాల పరిధిలో వ్యవసాయ భూములను U1 జోన్ లో చేర్చడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని... వెంటనే దీన్ని ఎత్తివేయాలంటూ గతకొద్ది రోజులుగా  తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి రైతులు నిరసనలు చేపట్టారు. ప్రస్తుతం రైతులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అయినప్పటికి వైసిపి ప్రభుత్వం స్పందించకపోవడంతో ఇక కుటుంబాలతో కలిసి ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే కారుణ్య మరణాలకు అనుమతివ్వాలని రాష్ట్ర గవర్నర్ ను కోరినా స్పందన లేకపోవడంతో ఈసారి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అనుమతి కోరారు. కారుణ్య మరణాలను అనుమతివ్వాలని కోరుతూ   U1 జోన్ రైతులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఉత్తరాలు రాసారు.