Apr 6, 2022, 2:45 PM IST
తాడేపల్లి: తమ గ్రామాల పరిధిలో వ్యవసాయ భూములను U1 జోన్ లో చేర్చడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని... వెంటనే దీన్ని ఎత్తివేయాలంటూ తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి రైతులు గతకొద్ది రోజులుగా నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే తమ సమస్యను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు తమ నిరసన మరింత ఉదృతం చేసారు. తాడేపల్లిలోని నగర పాలక కార్యాలయం ఎదుట యూ-1 రిజర్వు జోన్ తొలగించాలని కోరుతూ రైతులు రిలేదీక్షకు కూర్చున్నారు. యూ -1 జోన్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్చలకు పిలవాలని... సీఎం జగన్ తమకు కలిసే అవకాశమివ్వాలని కోరారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని రైతులు డిమాండ్ చేసారు. ప్రభుత్వం స్పందించన పక్షంలో రైతు ఉద్యమం ఉధృతం చేస్తామని బాధిత రైతులు హెచ్చరించారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరసనలు కొనసాగుతునే ఉంటాయని రైతులు పేర్కొన్నారు.