Aug 6, 2021, 2:18 PM IST
గుంటూరు: అక్రమంగా మద్యం తరలిస్తున్నామని ఎక్సైజ్ పోలీసులు కేసులు బనాయించాలని చూస్తున్నారంటూ ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి తమను చితకబాదడమే కాదు కారులో పోలీసులే మద్యం బాటిల్స్ పెట్టి అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్థాపానికి గురయిన అలీషా, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.
ఈ ఘటన గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం బట్రుపాలెంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకుని బట్రుపాలెం గ్రామానికి చెందిన కొందరు రోడ్డుపై బైటాయించి పోలీసులకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.